Monday, June 15, 2015

Namasthe Notifications 15-06-15


మధ్యప్రదేశ్‌లో మెడికల్ ఆఫీసర్స్..


మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఎంపీపీఎస్సీ (మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 
-మొత్తం పోస్టులు: 1896
-విద్యార్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: జూలై 14
-వెబ్‌సైట్: www.mppsc.nic.in

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్


యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ లా విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 100
-విభాగం: ఫ్యాకల్టీ ఆఫ్ లా (న్యాయ విభాగం)
-మంచి విద్యార్థి రికార్డ్‌తో మాస్టర్ డిగ్రీ ఇన్ లాలో 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ-50 శాతం) ఉత్తీర్ణత, యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ..
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో..
-వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబంధిత అధికారికి పంపించాలి.
-చివరి తేదీ: జూన్ 26, వెబ్‌సైట్: www.du.ac.in

మహానది కోల్‌ఫీల్డ్‌లో ఉద్యోగాలు..


ఒడిశాలోని సంబల్పూర్ ప్రాంతంలో ఉన్న మహానది కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 94
-మైనింగ్ సిర్దార్- 91, డిప్యూటీ సర్వేయర్స్ - 3
-అర్హతలు: పదో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, డెరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ ద్వారా మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ అండ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
-డిప్యూటీ సర్వేయర్స్: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ ద్వారా సర్వే సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-వయస్సు: జూలై 20 నాటికి 18 ఏండ్ల నుంచి 25 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ..
-దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: ఆగస్టు 4
-ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: జూలై 20
-వెబ్‌సైట్: www.mcl.gov.in 


సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు..


జమ్ముకశ్మీర్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 29 
-ప్రొఫెసర్స్- 6, అసోసియేట్ ప్రొఫెసర్స్- 21, అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 2
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషనల్ స్టడీస్, ఇంగ్లీష్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హెచ్‌ఆర్‌ఎం అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, మ్యాథమెటిక్స్, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్ అండ్ న్యూ మీడియా, సోషియాలజీ అండ్ సోషల్ వర్క్.
-అర్హతలు: పైన తెలిపిన సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/ రీసెర్చ్‌లో ప్రొఫెసర్స్‌కు 10 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్స్‌కు 8 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కు మాస్టర్ డిగ్రీతో పాటూ యూజీసీ/సీఎస్‌ఐఆర్‌లో నెట్/సెట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ..
-దరఖాస్తు: ఆఫ్‌లైన్, చివరితేదీ: జూలై 15
-వెబ్‌సైట్: www.cujammu.ac.in

అలహాబాద్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్


అలహాబాద్ బ్యాంక్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులైన ఐటీ మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదలయ్యింది.
-మొత్తం పోస్టులు: 12 (మేనేజర్స్ ఐటీ- 10, సీనియర్ మేనేజర్స్- 2)

అర్హతలు


-మేనేజర్స్ ఐటీ: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో B.Tech/ M.Tech ఉత్తీర్ణత లేదా డిగ్రీ స్థాయిలో DOEACC B LEVEL సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో రెండు ఏండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: OBC- 38 ఏండ్లు, SC/ST-40 ఏండ్లు
-సీనియర్ మేనేజర్స్: CA/ ICWA/ MBA (Finance) /MMS (Finance) లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 3 ఏండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: OBC- 43 ఏండ్లు, SC/ST- 45 ఏండ్లు
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.., చివరి తేదీ: జూలై 7
-ఆన్‌లైన్ టెస్ట్: ఆగస్టు 2
-అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ రూ. 100, ఓబీసీ రూ. 600
-వెబ్‌సైట్: www.allahabadbank.com

ఎఫ్‌సీఐలో మేనేజర్స్


ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.
-మొత్తం ఖాళీలు: 22
-జనరల్ అడ్మినిస్ట్రేషన్-4, అకౌంట్స్-11, లా-5, మెడికల్- 2

అర్హతలు


-జనరల్ అడ్మినిస్ట్రేషన్: 55 శాతం మార్కులతో PG/ACA/AICWA/ACS/ 55 శాతం మార్కులతో 5 సం॥ల ఇంటిగ్రేటెడ్ లా/ బ్యాచ్‌లర్ ఆఫ్ లా
-అకౌంట్స్: అసోసియేట్ మెంబర్‌షిప్ ఆఫ్ చార్డెట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా/కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా/కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
-లా: ఏదైన యూనివర్సిటీలో లా డిగ్రీ, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-మెడికల్: MBBSలో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600
-sc/st/pwd/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్, దరఖాస్తు ప్రారంభం: జూలై, 14
-చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: www.fcijobsportal.com

ప్రసార భారతీలో కంటెంట్ ఎగ్జిక్యూటివ్‌లు..


న్యూఢిల్లీలోని ప్రసార భారతి, దూరదర్శన్ న్యూస్‌లో కంటెంట్ ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్ పద్ధతి)గా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..
-మొత్తం పోస్టులు: 23
-పే స్కేలు: రూ. 20,000
-అర్హత: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం కలిగి ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో..
-వెబ్‌సైట్: www.prasarbharati.gov.in

5 comments: