Tuesday, June 2, 2015

జులైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం కేసీఆర్

CM KCR Announced 25 thousand jobs notification in Julyహైదరాబాద్: పరేడ్‌గ్రౌండ్స్‌లో అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. ఆవిర్భావ వేడుకలు కన్నులపండుగగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. 

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించినం. తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. దామరచర్ల, కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్లగొండలో అల్ట్రామెగా పవర్‌ప్లాంట్ సాకారం కాబోతోంది. 

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. రూ.28వేల కోట్లు సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదని తెలిపారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం. ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతం.

అంగన్‌వాడీ, హోంగార్డులకు జీతాలు పెంచినం. మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్లపై కమిటీలు వేసినం. రైతులకు రూ.17వేల కోట్ల పంట రుణమాఫీ చేసినం. రూ.400 కోట్లతో పోలీస్ వ్యవస్థ అధునీకరణ చేసినం. మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్ అండ్‌బీ, పంచాయితీరాజ్ ఆధ్వర్యంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపట్టాం. 

మిషన్ కాకతీయ మరో అద్భుతమైన కార్యక్రమం. 46వేల చెరువులకు పూర్వవైభవం తెస్తాం. 300 కోట్ల మొక్కలను పెంచాలన్న ఉద్దేశంతో హరితహారం నిర్వహిస్తున్నాం. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

జులైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జులై నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టబోతున్నాం. పాలమూరు, నల్లగొండ జిల్లా కన్నీరు తుడవడానికి రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం, రూ.30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడ్తామని సీఎం ప్రకటించారు. 

No comments:

Post a Comment