Thursday, February 26, 2015

Railway budget Highlights

Railway budget Highlights
● No increase in passenger fares
● SMS alert to be introduced for train timings
● To introduce air-conditioned coaches for suburban trains
● Wi-fi to be available at 400 railway stations
● To revamp station redevelopment policy completely
● To have bidding system for redevelopment of stations
● To develop 10 satellite railway stations this year
● On-board entertainment facility could be extended on Shatabdi trains
● Mobile charging stations will be introduced general class coaches
● Wagon-making scheme to be reviewed to make it easier for
private investment
● To improve cleanliness & design of bed linen
● All India 24x7 grievances helpline 138 to start soon
● 7,000 more toilets to be replaced by Bio-Toilets, New toilets at 650 stations, more vacuum toilets
● Passenger travelling unreserved can procure a ticket within 5 minutes
● Mobile application to address complaints of people is also being
developed
● Hand-held devices for ticket checkers for moving towards
paperless ticketing
● Centrally managed railway display network in over 2000 stations in next 2 years
● We are committed to provide rail connectivity to North Eastern states
● CCTVs to be introduced in select trains and suburban trains for
women safety
● Train Protection Warning System, Train Collision Avoidance System
● Tickets can be booked 120 days in advance instead of 60 days
● Plan expenditure to go up to a record Rs 1.1 lakh crore in 2015-16 from Rs 66,000 crore in the previous year
● Railways plans to spend over Rs 8 lakh crore over five years
● We will introduce train sets saving 20% of journey time, similar to bullet trains in design, and that can run on existing tracks
● Feasibility report of high speed train between Mumbai and Ahmedabad expected by mid-2015
● The speed passenger trains across nine corridors will be increased to 160-200 km from 110 km
● Railways to go through transformation in five years; to
increase track capacity by 10 per cent to 1.38 lakh km
● To monetise assets rather than sell them
● To set up full-fledged Railway University in FY16
● Rs.2000 crore for Coastal Connectivity Program; Rs.2500 crore
through BOT/Annuity route
● 6608 kms of track to be electrified
● Projects worth Rs 96,182 crore to expand capacity of 9,420 km rail lines
● Drawing up comprehensive policy to tap latent advertising potential



రైల్వే స్వరూపాన్నే మార్చేస్తాం



- భద్రతకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం
- దేశం మొత్తానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం
- రైలు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు

Rail Budget of India 2015-16 - Union Budget Speeches

న్యూఢిల్లీ : రైల్వేలు భారత జీవననానికి ప్రతీక అని, ఈ ఐదేళ్లలో మొత్తం రైల్వేల స్వరూపాన్నే మొత్తంగా మార్చేస్తామని, ప్రయాణికులకు అడిగినవి, అడగనివి అన్నీ చేస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇవాళ పార్లమెంటులో ఆయన 2015-16 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తంగా ప్రజలకు అరచేతిలో ప్రపంచాన్ని చూపించారు. మొత్తం ఎన్నిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు పెడతామని తెలిపారు. రైళ్ల డిజైన్లు మారుస్తాం, వేగాన్ని పెంచుతాం, మునుపెన్నడూ ఊహించని విధంగా రైళ్లలో స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తాం, రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిబులింగ్, నాలుగు లైన్లు ఇలా ఎన్నో చేస్తామని చెప్పారు. ఇకపై నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకునే విధంగా ఆన్‌లైన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రైల్వేల్లో భద్రతను మరింత పెంచుతామని, ఇలా చెప్పకుంటూ పోతే తెల్లారుతుంది.

అంత లిస్టు సురేష్ ప్రభు చదివి వినిపించారు. ఇవన్నీ విన్నవారికి అసలు చేయనిదేదీ లేదని తెలుస్తుంది. టోటల్‌గా దేశం మొత్తానికి రైల్వే కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ.. ఇవన్నీ ఎలా చేస్తామనే విషయానికొస్తే తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. బడ్జెట్‌లో పొందపర్చనవసరం లేని పరిపాలన విషయాలను కూడా మంత్రి తన ప్రసంగంలో చదివి కాస్త కన్ఫ్యూషన్‌కు కూడా గురి చేశారు.

తాను చెప్పిన అన్నీ పనులు జరగాలంటే ఎఫ్‌డీఐలు, ప్రైవేటు పెట్టబడులు, చివరకు ఎంపీ ల్యాడ్స్‌ను కూడా ఉపయోగించాలని చెప్పారు. ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నుంచి స్థానిక రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులను ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు కోటి రూపాయలకు పైగా రైల్వేకు కేటాయించారని తెలిపారు. ఇక రైల్వే బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే లేదు. అసలు ఏ రాష్ట్రం పేరు లేదు. ఏరాష్ర్టానికారాష్ట్రం గురించి చెప్పకుండగా మొత్తంగా అందరికీ కలకలిపి అన్నీ చేస్తామని చెప్పారు. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా దేనికి ఎంత, ఏది ఎట్లెట్ల చేస్తామనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడిస్తామని రైల్వే మంత్రి తెలిపారు. చివరగా ఇది కామన్ మ్యాన్ బడ్జెట్
మహిళల బడ్జెట్, ఉద్యోగ బడ్జెట్ అని రైలు మంత్రి కొనియాడారు.

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు...

Highlights of Railway Budget

ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
రైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు...
* ఆన్‌లైన్ సౌకర్యాలతో ప్రయాణికులకు దగ్గరయ్యాం
* విజన్ 2030 ఆశయంతో రైల్వే బడ్జెట్ రూపొందించాం
*సరుకు రవాణాతో ఆదాయం పెంచుకోబోతున్నాం
* కామన్ మ్యాన్‌కు రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంది.
* స్వచ్ రైల్, స్వచ్ భారత్ నినాదంతో ముందుకెళతాం
* ప్రజలకు దగ్గరయ్యేందుకు నాలుగు లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం.
* రైల్వేలో కొత్తగా 17 వేల బయోమెట్రిక్ టాయిలెట్లు
* రైల్వే ఛార్జీలు పెంచడం లేదు
* రైల్వే ప్రయాణికుల కోసం 138 టోల్‌ఫ్రీ నంబర్‌తో 24 గంటలు ఫిర్యాదుల స్వీకరణ
* క్లీనింగ్‌ల కోసం ఏజెన్సీలను నియమిస్తాం
* రైల్వేలకు ఎన్‌డీఏ ప్రభుత్వం పునర్‌జన్మనిస్తుంది.
* మొదటి ప్రాధన్యత రైల్వే క్లీనింగ్‌కు ఇస్తాం
* 650 స్టేషన్‌లలో బయో టాయిలెట్స్ నిర్మిస్తాం
* ట్రైన్‌ను ట్రావెలింగ్ హోంగా భావించండి.
* ఐటీసీటీసీతో విరివిగా సేవలు అందిస్తాం
* 182 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా సెక్యూరిటీ ఫిర్యాదులు పరిష్కరిస్తాం
* అన్ రిజర్వ్‌డ్ క్లాసుల్లో ప్రయాణికులంతా టికెట్లు కొనేలా చేశాం.
* టికెట్ల జారీకి వెండింగ్ మిషన్‌లు
* వెండింగ్ మిషిన్స్‌ను ఇంకా విస్తరంగా ఏర్పాటు చేస్తాం
* 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరిగింది
* 108 రైళ్లలో ఈ క్యాటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం
* టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో భోజనం ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
* రైల్ కమ్ రోడ్ టికెట్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
* ప్రస్తతం ఆరువందల ప్రాంతాల్లో ఇది అమలు అవుతోంది.
* మొబైల్ ఎస్‌ఎమ్‌ఎస్‌ను టికెట్‌గా పరిగణిస్తున్నాం
* పేపర్ లెస్ ట్రావెలింగ్‌లో రైల్వేదే అగ్రస్థానం
* సదరన్ రైల్వేలో స్మార్ట్ ఫోన్ల ద్వారా టికెటింగ్ అమలు చేస్తాం.
* రైల్ రాకపోకలపై ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నాం
* లేడీస్ కాంపార్ట్‌మెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తాం.
* 1,052 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది.
* ఏ1 స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నాం.
* సీనియర్ సిటీజన్‌లకు ఆన్‌లైన్ వీల్ చైర్ బుకింగ్
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం.

* వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు
* త్వరలో బుల్లెట్ ట్రైన్‌లు ప్రవేశపెడుతున్నాం.
* రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి.
* ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపైనే బుల్లెట్ ట్రైన్‌లు పరుగులు తీస్తాయి.
* ఎంపీలు తమ నిధులను రైల్వేల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి.
* ఇద్దరు ఎంపీలు తమ నిధులు రైల్వే అభివృద్ధికి కేటాయించారు.
* స్టేషన్ల అభివృద్ధికి బిడ్డింగ్స్ నిర్వహిస్తాం.
* అన్ని రాష్ర్టాలకు సమానంగా కేటాయింపులు చేశాం.
* ఈశాన్య రాష్ర్టాలకు రైల్ కనెక్టివిటీ పూర్తి చేస్తాం
* ఉదంపూర్, కాత్రా రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తాం.
* కేఎమ్‌పీఎల్ పెంచడం కోసం పవర్ లైన్స్ ఏర్పాటు చేస్తాం.
* ట్రాన్స్‌పోర్టు లాజిస్టిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో సరుకు రవాణా.
*పెద్ద నగరాల్లో పది శాటిలైట్ టెర్మినళ్లు
* రూ.9618 కోట్లతో 77 రూట్లలో 9400 కి.మీ డబ్లింగ్, ట్రిప్లింగ్
* ఫ్రైట్ కారిడార్లుగా ఈస్టన్, వెస్టన్ కారిడార్లు గుర్తింపు
* ఎస్‌ఎంఎస్ ద్వారా 15 నిమిషాల ముందుగానే రైళ్ల సమాచారం.
* ఏ2 రైల్వే స్టేషన్‌లలో వైఫై సౌకర్యం విస్తరిస్తాం.
* ప్రధాన రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు
*ఎస్కలేటర్ల కోసం రూ.120 కోట్లు
* కొత్తగా 10 గూడ్స్‌షెడ్స్ నిర్మించబోతున్నాం
* క్రాసింగ్స్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.
* ప్రమాద రహితంగా రైల్వేశాఖను మారుస్తాం.
* దేశవ్యాప్తంగా 970 ఆర్‌వోబీ, ఆర్‌యూబీలను పూర్తి చేస్తాం.
* ఇంతవరకూ ఎప్పుడూ ఈ స్థాయిలో అండర్ బ్రిడ్జెస్ నిర్మించలేదు.
* పీపీపీలను రైల్వేల్లోనూ ప్రవేశపెట్టబోతున్నాం.
* పీపీపీ విధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
* నాలుగు నెలల ముందుగా టికెట్ బుకింగ్
* అంధులకు సౌకర్యవంతంగా బోగీల నిర్మాణం
* పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులకు లోయర్ బెర్త్‌లు
* ఐదు నిమిషాల్లోనే జనరల్ టికెట్
* డిబెట్ కార్డు ద్వారా రైల్వే సేవలు పొందేందుకు అన్ని స్టేషన్లలో ఏర్పాటు
* ప్రయాణికుల సమస్యలు పరిష్కారానికి ముబైల్ అప్లికేషన్
* అధునాతన పద్ధతుల్లో రైల్వే ట్రాక్‌ల నిర్మాణం
* మరో నాలుగు నెలల్లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
* రైల్వేలో బ్యాంకులు, పింఛను నిధుల పెట్టుబడులు
* 9 కారిడార్లలో రైళ్ల వేగం 120 నుంచి 160కి.మీలకు పెంచుతాం.
* రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం భారీగా పెంచుతాం.
* కాపలాలేని క్రాసింగ్‌ల వద్ద ఆడియో, వీడియో హెచ్చరికల జారీ వ్యవస్థ
* కాపలా లేని క్రాసింగ్‌ల వద్ద భద్రతకు ఇస్రో, కాన్పూర్ ఐఐటీ సహాకారం.

No comments:

Post a Comment