Wednesday, February 25, 2015

సమస్త సమాచారం@ ప్రభుత్వ వెబ్‌సైట్‌తెలంగాణ... వలస పాలన నుంచి విముక్తినొందిన నేల. కొత్త రాష్ట్రం. కొత్త పాలన. నాలుగు కోట్ల ప్రజల ఆంకాక్ష ఫలించి సమస్త రంగాలు తెలంగాణీకరించబడుతున్న సందర్భం. ప్రజల ప్రయోజనాలకనుగుణంగా సాగుతున్న ప్రజాపాలన. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రగతి పథంలో పయనిస్తున్న ప్రభుత్వం. ప్రభుత్వ సమాచారాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సర్కారు అధికారిక వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. అన్ని శాఖలకు చెందిన పథకాలు, ప్రాజెక్టులు, అధికార యంత్రాంగపు పూర్తి సమాచారాన్ని పొందుపరిచిన ఈ పోర్టల్ ఇప్పుడు ప్రజల మన్నన్నలు పొందుతోంది.All information in Government Website

రాష్ట్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, మైనార్టీలు, దళితులు అన్ని సెక్షన్‌ల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కంకణబద్ధమైంది. అందుకే ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పథకాలతో పాటు, ఆయా విభాగాలు అందిస్తున్న సేవల పూర్తి వివరాలతో ప్రభుత్వం అధికార వెబ్‌సైట్ (www.telangana.gov.in) ని ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మొదలు చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ విభాగాలు, అధికారులు, మంత్రులకు చెందిన సమస్త సమాచారాన్ని పొందుపరిచింది. అన్ని విభాగాలకు సంబంధించిన సేలవలన్నింటినీ ఒకే చేర్చడం ఈ సైట్ ప్రత్యేకత.

వేల ఏళ్ల చరిత్ర..

పది జిల్లాల భౌగోళిక స్వరూపం గల రాష్ట్రం తెలంగాణ. భిన్న భాష, సంస్కృతుల సమ్మేళనం. ఈ నేలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ చరిత్రను క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి మొదలు నేటి వరకు శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీలు, తదనంతర వలస పాలనకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పోర్టల్‌లో పొందుపరిచారు. వేల యేళ్ల చరిత్రను ప్రజలముందుంచారు.

భిన్నత్వంలో ఏకత్వం..


All information in Government Website

తెలంగాణ భిన్న సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతికి తెలంగాణ నిదర్శనం. గొల్ల సుద్దులు, ఒగ్గు కథలు, యక్షగానం, చిందు భాగవతం వంటి కళారూపాలు ఇక్కడి సంస్కృతికి చిహ్నాలుగా నిలిచాయి. కవ్వాలి, గజల్స్, ముషాయిరాలు హైదరాబాద్ ప్రత్యేకతను చాటుతుంటాయి. బోనాలు, బతుకమ్మ వంటి పండుగలెన్నో శాతవాహనుల నుంచి నేటి వరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబించే ఎన్నో విషయాలను పోర్టల్‌లో పొందు పరిచారు.

ప్రాథమిక సమాచారం..


రాష్ర్టానికి చెందిన సమస్త సమాచారాన్ని పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాథమిక విషయాల నుంచి వైశాల్యం, పట్టణాలు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వరకు పూర్తి సమాచారం పోర్టల్‌లో లభిస్తుంది. జండర్, కులాల వారిగా జనాభా వివరాలు, వృద్ధి రేటు సమాచారం ప్రతి ఒక్కరికీ రాష్ట్రంపై ప్రాథమిక అవగాహనకు దోహదపడుతుందని ఉస్మానియా విద్యార్థి రమేష్ అన్నారు. రాష్ట్ర చిహ్నాలు మొదలు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు, కార్యదర్శులకు సంబంధించిన సమచారం, పాలనా వ్యవహారాలను గురించి కూడా తెలుసుకోవచ్చు.

సమస్త రంగాలు..


ఆయా శాఖల సేవలు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో పోర్టల్‌లో అన్ని విభాగాలకు చెందిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. వ్యవసాయం, వెనకబడిన వర్గాలు, సివిల్ సైప్లెస్, విద్యుత్, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, ఐటీ, హౌజింగ్, ఉన్నత విద్య, సమాచార, ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంట్, ఇరిగేషన్, లేబర్, లా, మైనార్టీ వెల్ఫేర్, పంచాయతీ రాజ్,ప్లానింగ్, రెవెన్యూ, పర్యాటకం, మహిళా అభివృద్ధి వంటి అన్ని విభాగాలకు సంబంధిన సమాచారం పొందుపరిచారు. ఆయా విభాగాల అధికారులు, వారి బాధ్యతలతో పాటు, విభాగాల అధికారిక వెబ్‌సైట్, సోషల్ నెట్‌వర్క్(ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్) లింకులను సైతం జత చేశారు. మొత్తంగా ఏ విభాగంలో ప్రజలకు సమాచారం అవసరమైనా, ఎవరిని సంప్రదించాలనుకున్నా, ఆయా శాఖల పనితీరు, రోజువారి ప్రగతిని తెలుసుకోవాలనుకున్నా తెలంగాణ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఐటీ ఉద్యోగి రాజీవ్ అన్నారు.

సర్వీసులు..


All information in Government Website

ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవల వివరాలు పోర్టల్‌లో పొందుపరిచారు. మీ సేవ, స్టేట్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, పబ్లిక్ యుటిలిటీస్ విభాగంలో ప్రజలు పొందుతున్న అన్ని సేవలకు సంబంధించిన వివరాలు, సంబంధిత లింకులు పోర్టల్‌లో ఒకేచోట చేర్చారు. ఆధార్ అప్లికేషన్ మొదలు హెల్త్‌కార్డు, క్రాప్ ఇన్సురెన్స్, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్, విద్యుత్ బిల్లులు, దేవస్థానాలు, ట్రేడ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, స్టూడెంట్స్ స్కాలర్‌షిప్స్ వరకు మీసేవలో అందుబాటులో ఉండే అన్ని దరఖాస్తు ఫాంలను తెలంగాణ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర సర్వీసులు, కేంద్ర సర్వీసులకు సంబంధించిన అన్ని లింక్‌లు ఒకే ఉండడం వల్ల కుల ధ్రువీకరణ, ఆర్థిక ధ్రువీకరణ పత్రాలు మొదలు రైల్వే రిజర్వేషన్, పాస్‌పోర్ట్ సేవ వంటి వేటికైనా పోర్టల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని సర్వీసులకు సంబంధించి సమాచారం ఒకేచోట ఉండడం ఉపయోగకరంగా ఉందంటున్నారు విద్యార్థులు.

కాంటాక్ట్స్..


విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మొత్తంగా ప్రజలందరికి అవసరాన్ని బట్టి సంప్రదించడానికి వీలుగా అన్ని విభాగాలకు చెందిన కాంటాక్ట్ నెంబర్స్, ఫ్యాక్స్‌నెంబర్స్, మెయిల్ ఐడీలను పోర్టల్‌లో పొందుపరిచారు. సచివాలయం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్, జిల్లాస్థాయి అధికారులు, పబ్లిక్ యుటిలిటీ కాంటాక్ట్స్‌తో పాటు అత్యవసర సమయంలో సంప్రదించేందుకు వీలుగా ప్రముఖ ఆసుపత్రులు, మీడియా, బ్లడ్ బ్యాంక్ వంటి కాంటాక్ట్ నెంబర్స్‌ని పోర్టల్‌లో పేర్కొన్నారు.

యూజర్ ఫ్రెండ్లీ..


వెబ్‌సైట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం గమనార్హం. క్షణాల్లో కావలసిన వివరాల్ని తెలుసుకునేందుకు వీలుగా పోర్టల్‌ని రూపొందించారు. ఏ శాఖకు సంబధించిన సమాచారం కావాలన్నా నేరుగా ఆయా శాఖల అధికారిక సైట్‌లోకి ప్రవేశించే అవకాశం. ప్రభుత్వ పథకాల ప్రత్యేకతను తెలిపే మిషన్ కాకతీయ, మన ఊరు-మన ప్రణాళిక, ప్రారిశ్రామిక విధానం వంటి అనేక విషయాలను తెలుసుకునే అవకాశం. రోజువారి వార్తలతో ప్రజలకు కావలసిన పూర్తి సమాచారాన్ని అందిస్తుండడం విశేషం.

No comments:

Post a Comment