Sunday, January 4, 2015

టీఎస్ పీఎస్సీ పరీక్షా ప్రణాళికల రూపకల్పనకు హరగోపాల్ కమిటీ

-చుక్కా రామయ్య, కోదండరాం, నాగేశ్వర్ సహా 25 మంది సభ్యులు
-మూడువారాల్లో నివేదిక
-తదుపరి సిలబస్‌పై దృష్టి

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన టీఎస్‌పీఎస్సీ.. కార్యాచరణలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. త్వరలో భర్తీ చేయాల్సిన ఖాళీల కోసం నిర్వహించాల్సిన పరీక్షా ప్రణాళికను ఖరారు చేసేందుకు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్‌సహా వివిధ రంగాలకు చెందిన 25మంది నిపుణులను సభ్యులుగా నియమించారు. 

haragopal


ఈ కమిటీ తొలుత పరీక్షా ప్రణాళికపై వివిధ రాష్ర్టాల్లోని విధానాలను అధ్యయనం చేస్తుంది. మూడువారాల్లో నివేదిక ఇస్తుంది. నివేదికపై కమిషన్‌లో చర్చించి.. ఆమోదంకోసం ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం దీనిపై జీవో జారీ చేయడంతో పరీక్షా ప్రణాళిక అమల్లోకి వస్తుంది. ఆ పని ముగియగానే ఇదే కమిటీ సిలబస్ తయారీపై దృష్టి కేంద్రీకరిస్తుంది. తెలంగాణ సర్వీస్ కమిషన్ సిలబస్ 

కమిటీ సభ్యులు వీరే..1. ప్రొఫెసర్ ఈ శివారెడ్డి, వైస్ చాన్స్‌లర్, తెలుగు యూనివర్సిటీ.
2. డాక్టర్ చుక్కా రామయ్య, విద్యావేత్త.
3. ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, మాజీ డైరెక్టర్, నాక్.
4. ప్రొఫెసర్ కోదండరాం, ఉస్మానియా యూనివర్సిటీ.
5. ప్రొఫెసర్ లింగమూర్తి, మాజీ వైస్ చాన్స్‌లర్, కాకతీయ యూనివర్సిటీ.
6. ప్రొఫెసర్ కే నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ
7. ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ.
8. డాక్టర్ రేవతి, సెస్.
9. ప్రొఫెసర్ జీ కృష్ణారెడ్డి, చైర్మన్, ఐసీఎస్‌ఎస్‌ఆర్, సౌత్ ఇండియా రీజియన్.
10. ప్రొఫెసర్ రమా మేల్కొటే, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ.
11. ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, వైస్ చైర్మన్, స్టేట్ కౌన్సెల్ ఆప్ హయ్యార్ ఎడ్యుకేషన్.
12. ప్రొఫెసర్ బీనా, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ.
13. ప్రొఫెసర్ సీ గణేష్, కోఆర్డినేటర్, ఏపీ సెట్.
14. ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధీఖీ, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్.
15. డాక్టర్ కనకదుర్గ, రిటైర్డ్, సీఫెల్
16. ప్రొఫెసర్ భూపతిరావు, రిటైర్డ్, ఉస్మానియా యూనివర్సిటీ
17. ప్రొఫెసర్ సీ వెంకటయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. 
18. డాక్టర్ నిశాంత్ దొంగరి, ఐఐటీ, హైదరాబాద్.
19. డాక్టర్ నందిని సిధారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్. 
20. ప్రొఫెసర్ రాజశేఖర్, మాజీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
21. ప్రొఫెసర్ జీ భద్రునాయక్, కాకతీయ యూనివర్సిటీ.
22. ప్రొఫెసర్ జే మనోహర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
23. డాక్టర్ టీ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ
24. ప్రొఫెసర్ జీబీ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ
25. డాక్టర్ బైరి ప్రభాకర్, హెచ్‌వోడీ, జీఎంఆర్ పాలిటెక్నిక్, గజ్వేల్ మెదక్ జిల్లా.


జలహారం కోసం అదనంగా 529 పోస్టులు మంజూరు


-మరిన్ని ఔట్‌సోర్సింగ్ పోస్టులకు కూడా గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్, జనవరి 3 (టీ మీడియా): ప్రతిష్ఠాత్మక జలహారం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం అదనపు పోస్టులు మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జలహారం కోసం తాజాగా 529 అదనపు పోస్టులు మంజూరుచేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ శనివారం జీవోనంబర్ 4ను జారీ చేశారు. అంతేకాకుండా మరో 47 సీనియర్ అసిస్టెంట్, 662 వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. 

కొత్తగా మంజూరుచేసిన 529 పోస్టుల్లో ఒక సీఈ, 10 మంది ఎస్‌ఈలు, 31మంది ఈఈలు, 104మంది డీఈఈలు, 346 మంది ఏఈఈలు, ఒక సీఏవో, 14 డీఏవోలు, 22 మంది పర్యవేక్షకుల పోస్టులున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఇంటింటికి సురక్షిత మంచినీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి అందించేందుకు ప్రభుత్వం జలహారం పనులను చేపడుతున్నది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమం అమలుతోపాటు వాటర్‌గ్రిడ్ పనుల పర్యవేక్షణ కోసం ఈ సిబ్బందిని నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సబ్జెక్టులవారీగా ఎలా ఉండాలో ఈ కమిటీలోని వివిధ నిపుణులు చర్చించి ఖరారుచేస్తారు. వారిచ్చే నివేదికను పరిశీలించే ప్రభుత్వం.. దానిపై ఆమోద ముద్ర వేయడంతో సిలబస్ నిర్ణయమవుతుంది. ఈ రెండు అంశాల అనంతరం పరీక్షల నిర్వహణ ఉంటుంది.

తేలని పంచాయితీ


విద్యామంత్రులతో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో దాదాపు గంటన్నరపాటు భేటీ జరిగింది. రెండు రాష్ర్టాల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని ఇద్దరికీ గవర్నర్ సూచించారని తెలిసింది. మధ్యేమార్గంగా ఏడాదికొకరు చొప్పున ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించుకుంటే మంచిదని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అంగీకరించలేదని తెలిసింది. 

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం తామే ఎంసెట్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. తమ పరీక్ష తామే నిర్వహిస్తామని, కావాలంటే ఆంధ్రప్రదేశ్ అధికారులకు సహకరిస్తామని ఆయన చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఈసారి ఎంసెట్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహించే అవకాశం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాను చేసిన సూచనలను ముఖ్యమంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని గవర్నర్ ఇద్దరు మంత్రులకు చెప్పారని సమాచారం. 

గవర్నర్‌తో జరిగిన చర్చల్లో వివాదం ఇంకా కొలిక్కిరాలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అనంతరం మీడియాకు తెలిపారు. ఇద్దరి అభిప్రాయాలను గవర్నర్ తెలుసుకున్నారని చెప్పారు. ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని గంటా వ్యక్తంచేశారు. సమస్య పరిష్కారానికి మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జరిగిన చర్చల వివరాలను కొన్నింటిని వెల్లడించలేనని పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో విద్యామంత్రులు చర్చించిన తర్వాత మరోసారి రాజ్‌భవన్‌లో భేటీ అయ్యే అవకాశం ఉంది.


Source: Namasathe Telangana.com

No comments:

Post a Comment