Friday, September 12, 2014

7కొత్త జిల్లాలు 5స్మార్ట్ సిటీలు

-కేంద్రం తొలి జాబితాలో రాష్ట్రంలోని ఐదు నగరాలు..
-హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్,నిజామాబాద్, నల్లగొండలకు చోటు!
-ఆంధ్రప్రదేశ్‌లో నాలుగింటికి అవకాశం

 
తెలంగాణ రాష్ట్రంలో పాలనపరమైన సౌలభ్యం కోసం తొలి దశలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నివేదికను సమర్పించాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటి దశలో మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది.

అభివృద్ధి వికేంద్రీకరణ.. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల రూపంలో

చేపడుతున్న ఈ ప్రక్రియ తెలంగాణలోని పలు నగరాలకు కొత్త శోభను తేనుంది. దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసిన కేంద్రం అందులో తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్,నల్లగొండలకు చోటుకల్పించినట్లు తెలిసింది.

హైదరాబాద్/ కరీంనగర్ కార్పొరేషన్, టీ మీడియా: అభివృద్ధి వికేంద్రీకరణ.. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల రూపంలో చేపడుతున్న ఈ ప్రక్రియ తెలంగాణలోని పలు నగరాలకు కొత్త శోభను తేనుంది. దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసి, అభివృద్ధి చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లో రూ.7060 కోట్లను సైతం కేటాయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలను వారి ముందు ఉంచిన ముఖ్యమంత్రి... స్మార్ట్ సిటీలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కేంద్రం వంద నగరాల ఎంపికలో భాగంగా తొలి విడతగా తెలంగాణ రాష్ట్రంలోని ఐదు నగరాలకు ఎంపిక చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండలకు చోటు దక్కినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, కర్నూలుతోపాటు చిత్తూరును స్మార్ట్ జాబితాలో ఎంపిక చేసినట్లు తెలిసింది. కేంద్రం విధివిధానాలను ఖరారు చేయనప్పటికీ ప్రధానంగా మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు రానున్నాయని అధికారవర్గాలంటున్నాయి. మంచినీటి సరఫరా, రహదారులు, మురుగునీటి పారుదల, విద్యుదీకరణకు కేంద్ర నిధులు రావడం చాలా ఊరట కలిగించే అంశం.

No comments:

Post a Comment