Friday, August 8, 2014

Separate Notification for EAMCET Councelling- విధివిధానాలపై నేడు మండలి భేటీ
- సొంతంగానే ఎంసెట్ కౌన్సెలింగ్
- ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం
- ఈ నెలాఖరు నాటికి ఎంసెట్ ప్రవేశాలు పూర్తిచేస్తాం
- వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం
- తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ పాపిరెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 7 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్రంలో సొంతంగానే ప్రవేశాలు నిర్వహించడానికి ప్రత్యేక ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. విధివిధానాలపై శుక్రవారం ఉన్నత విద్యామండలి సమావేశమవుతున్నదని వెల్లడించారు. సకాలంలోనే ప్రవేశాలు పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ విద్యా మండలి చైర్మన్‌గా గురువారం మూడున్నర గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

papireddyyఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సొంత రాష్ట్రంలోనే ఎంసెట్ ప్రవేశాలకు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటామని తెలిపారు. అందుకు రెండు రోజులుగా భారీ కసరత్తులు జరుగుతున్నాయని చెప్పారు. ఎంసెట్ ప్రవేశాల విషయంలో ఈ నెల 11న తుది తీర్పు విడుదల కావాల్సి ఉందని, దానిప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరుగదని హామీ ఇచ్చారు. ఎంసెట్ ప్రవేశాల్లో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించాలి. వెబ్ కౌన్సెలింగ్‌ను ఎప్పటినుంచి ప్రారంభించాలన్న అంశంలో శుక్రవారం జరిగే భేటీలో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరులోగా ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్‌ను సకాలంలో పూర్తి చేయడంతోపాటు అన్ని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో దేశంలోకెల్లా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే సీఎం కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని తెలిపారు. అనంతరం ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్ వేణుగోపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు

No comments:

Post a Comment