Thursday, August 14, 2014

చిన్నారి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శరత్ అనే 11 ఏళ్ల చిన్నారి ఆకాంక్షను సీఎం కేసీఆఆర్ నెరవేర్చారు. "మేక్ ఎ విష్ ఫౌండేషన్" స్వచ్ఛంధ సంస్థ ద్వారా సమాచారం తెలుసుకున్న కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలున్ని పరామర్శించారు. నీకేం కావాలని సంస్థ ప్రతినిధులు అడిగినపుడు "కేసీఆర్ ను చూడాలని ఉంది" అని చెప్పడంతో ఈ ఏర్పాటు చేశారు. బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన శరత్ సెప్టల్ డిఫెక్ట్ అనే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. శరత్ ఆరోగ్యానికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం చెప్పారు. అలాగే పిల్లడి కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తరపున మరో 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం సైతం ఆ కుటుంబానికి అందించనున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment