Tuesday, July 15, 2014

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు!


హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీపీఎస్సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలతో కూడిన ఫైలును ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే రూపొందించిన విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి పూర్తిస్థాయిలో పరిపాలన సదుపాయాలు, నిర్వహణ కోసం చైర్మన్, సభ్యుల నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.  

No comments:

Post a Comment